Trending Now

ఇదేందయ్యా మల్లారెడ్డి.. అన్నంలో పురుగులంటూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మాస్​ మల్లారెడ్డిగా పేరొందిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి కష్టాలొచ్చి పడ్డాయి. ఇటీవల ప్రభుత్వ స్థలం నుంచి ఆయన కళాశాలలకు విశాలమైన రోడ్డు (ప్రభుత్వ నిధులతో) వేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న మల్లారెడ్డికి తాజాగా తన కళాశాలకు చెందిన విధ్యార్థుల ఆందోళనలు కునుకుపట్టనియ్యడంలేదు. గత ప్రభుత్వంలో ఎంతో వెలుగు వెలిగిన మల్లారెడ్డికి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కష్టాలొచ్చిపడ్డాయంటూ సోషల్​మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. తాజాగా మంగళవారంనాడు కళాశాల హాస్టల్​లో పురుగుల అన్నం పట్ల విద్యార్థుల ఆందోళనకు దిగారు. దీంతో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కళాశాల గేటు ముందు ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఆహార భోజనంలో పురుగుల కలకలం రేపుతోంది. నిన్న (సోమవారం) రాత్రి అన్నం, ఇతర ఆహార పదార్థాల్లో పురుగులు వచ్చాయంటూ విద్యార్థినిలు క్యాంపస్ ఆవరణలో ఆందోళన చేపట్టారు.

జస్టిస్.. అంటూ నినాదాలు చేశారు. గత నెల రోజుల వ్యవధిలో విద్యార్థులు ఆందోళనకు దిగడం ఇది మూడో సారి. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు సర్ధిచెప్పడంతో వివాదం ముగిసింది. అయితే.. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్‌లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా దిగాయి. అయితే మరోసారి పురుగులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని స్వయంగా మల్లారెడ్డి హామీ ఇవ్వడంతో విద్యార్థులు వెనక్కి తగ్గారు. అయితే ప్రతీసారి అదే రిపీట్ అవుతుండటం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News