ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 13 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పుత్లిబౌలి పోలింగ్ బూత్ 264 టు 65 280 ల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ ల వద్ద 100 మీటర్ ల లోపు ఉన్న పరిసరాలలో సంచరిస్తడంతో పోలీసులు చెదరగొట్టారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల పై లాఠీలు జూలిపించవలసి వచ్చింది. అనంతరం ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోవచ్చారు.