Trending Now

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన భరణి సాయిలోకేశ్‌ (15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18 నుంచి పరీక్షలు ఉండటంతో అతడు ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నాడు. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో సరదాగా స్నేహితులతో కలిసి రెండు బైక్‌లపై కేబీఆర్‌ పార్క్‌కు బయలుదేరారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 3, టీవీ 9 చౌరస్తా నుంచి కేబీఆర్‌ పార్కు వైపు వెళ్తూ.. సిగ్నల్‌ వద్ద బైక్‌ అదుపుతప్పింది. దీంతో బైక్‌ నడిపిస్తున్న లోకేశ్‌ ఎగిరి కరెంట్‌ స్తంభానికి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Spread the love

Related News

Latest News