ప్రతిపక్షం, వెబ్ డెస్క్: వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొర్రపాడులో పదో తరగతి విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది. సోమవారం పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది. వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.