TGPSC Group 1 Candidates Protest: హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉద్రికత్త నెలకొంది. గ్రూప్స్ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు, జీఓ 29ను సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10మందిని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.