Special Buses For Dussehra Festival: దసరా, బతుకమ్మ పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మరో 600 స్పెషల్ సర్వీసులను నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సులను ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గత ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడవద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే.



























