ప్రతిపక్షం, హుస్నాబాద్ ఏప్రిల్ 15: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అడిషనల్ ఇంచార్జిగా బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని నాయకుడు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ ని నియమించినట్లు ఓబీసీ విభాగం చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడిషనల్ ఇన్చార్జిగా నియమించినందుకు నాపై నమ్మకంతో నియమించినందుకు పార్టీ గెలుపుకి కృషి చేస్తానని కార్యకర్తలు సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం చేస్తానని అన్నారు. నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.