ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 29 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 46వ అహోబిలం నరసింహస్వామి పీఠాధిపతి శ్రీ శ్రీ రంగనాథ యతేంద్ర మహా దీక్షణ్ సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో తాను రావడం రెండవ సారి అని ఈ తరాలు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులకు ఆశీర్వచనాలను అందజేశారు. అహోబిలం నరసింహస్వామి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రంగనాథ యతేంద్ర మహాదీక్షం రాక ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం జరిగింది.
దేవరకోట దేవస్థానంలో అహోబిలం నరసింహ స్వామికి పూజలు ఎలా గా జరుగుతుందో సాక్షాత్తు స్వామి వారి అభిషేకము పూజ కార్యక్రమం 25 మంది ఆచార్యులతో నిర్వహించడం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం స్వీకరించారు. పీఠాధిపతి ప్రసాదంగా అక్షింతలు, ఆశీర్వాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీ ధర్, కార్యనిర్వాహణాధికారి, ధర్మకర్తలు అయ్యన్న గారి శ్రీనివాస్, దార్ల రాజేశ్వర్, జాప అనిల్, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.