గంటకు 12 కి.మి వేగంతో కదులుతున్న తుఫాను
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
ప్రతిపక్షం, విశాఖపట్నం, అక్టోబర్28: గంటలకు 12 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న ‘మొంథా’ తూఫాను తీరం వైపు దూసుకొస్తుందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. కొద్ది గంటలుగా వేగంగా కదులుతున్న తుఫాను మచిలీపట్నానికి 160 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీవ్రతను విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వివరించింది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అధికారులు, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు నగదు ఇవ్వాలని, బియ్యం సహా అవసరమూన నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. కేంద్రాల్లో ప్రజలకు మంచి ఆహారంతో పాటు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రజలు సురక్షితంగా ఉండాలని, ఏదైనా అవసరం వస్తే కంట్రోల్‌రూం అధికారులకు తెలియజేయాలని హోం మంత్రి అని ప్రకటించారు.





























