ప్రతిపక్షం, కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రామాలాపకపోతే హుస్నాబాద్ లో అడుగుపెట్టనీయబోమని బీజేపీ నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల కవ్వింపు చర్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. మీ సమక్షంలోనే దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ.. పోలీసులపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. కోడిగుడ్లతో దాడి చేస్తున్న వ్యక్తులను కనీసం నిలువరించకపోవడమేంటని నిలదీత.. అట్లాంటప్పుడు మీ భద్రత నాకు అక్కర్లేదు.. వెళ్లిపోండంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నా రక్షణ సంగతి మా కార్యకర్తలే చూసుకుంటారని బండి సంజయ్ పోలీసులకు వెల్లడించారు. మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని హెచ్చరించారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య వంగరలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతున్నది.