తృటిలో తప్పిన ప్రమాదం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 10 : అదిలాబాద్ బీఆర్ఎస్ అదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామానికి ప్రచార నిమిత్తం వెళ్లిన వాహనం గ్రామ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వలనే బోల్తా పడినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరుగాకపోగా, ఒకేసారి ప్రచార రథం పల్టీ కొట్టడంతో అందులో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.