*చండూరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గంటేకంపు అశోక్ ఫైర్ .
ప్రతిపక్షం / చండూరు, సెప్టెంబర్ 08: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై బీఆర్ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చండూరు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గంటేకంపు అశోక్ పేర్కొన్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పీఠంపై కూర్చోవడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అందుకే ఉద్దేశపూర్వకంగా స్పీకర్ పీఠాన్ని కించపరిచేలా, అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ స్పీకర్ పీఠం అత్యంత గౌరవప్రదమైనదని, ప్రజాస్వామ్యంలో ఆ పీఠానికి ఒక విలువ ఉందని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత నాయకుడిని అవమానించడం బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు.అధికారం కోల్పోయామనే అక్కసుతోనే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దళిత సమాజానికి, స్పీకర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.





























