Trending Now

లోయలో పడ్డ కారు.. ముగ్గురిని రక్షించిన పోలీసులు

ప్రతిపక్షం ప్రతినిధి, నిర్మల్, జూలై 21 : తెల్లవారుజామున 2 గంటలసమయంలో హైదరాబాద్ నుండి నాగపూర్ కి వెళ్తున్న కారు మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్ లో పొగ మంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక, అదుపు తప్పి లోయలో పడిపోయింది. డయల్ 100 ద్వారా నిర్మల్ కంట్రోల్ రూం కి సమాచారం రావడంతో, వెంటనే అప్రమత్తమైన నిర్మల్ DCRB ఇన్స్పెక్టర్ గోపినాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్ ఇద్దరు వెళ్లి వారిని లోయలో గుర్తించి వెంటనే కాపాడారు. కారు లో ఉన్న రాధా కృష్ణ , ఆయన భార్య, కుమారుడిని, ముగ్గురిని కాపాడి స్వల్ప గాయాలు కావడంతో తక్షణమే నిర్మల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులను హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు. ఇన్​స్పెక్టర్​ గోపీనాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్ పోలీసు సిబ్బందిని నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల అభినందించారు. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుండా పూత భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాంతాలు చలో మాయమయ్యాయి ప్రధాన అంతర్గత రహదారులను రాకపోకలు తీవ్ర ఇబ్బందుల మధ్య కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లారిజామున హైదరాబాద్ నుండి నాగపూర్ కి వెళ్తున్న ఒక కారు నిర్మల్ సమీపంలోని ప్రసిద్ధ మహెబుబ్ ఘాట్ వద్ద రెండు సెక్షన్ పై ఉండి రెండో సెక్షన్ పై నుండి లోయాల్లో పడింది.ఇందులో ముగ్గురు ప్రయాణిస్తుండగా వారికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న నిర్మల్, సారంగాపూర్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వారిని కాపాడారు. ఇది తెలుసుకున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క పోలీసుల చాకచక్యాన్ని ,పనితీరును గుర్తించి వారికి అభినందించారు.

Spread the love

Related News

Latest News