ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 24 : అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం రాత్రి సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు మంథని మండలం గద్దలపల్లిలో సరుకు రవాణా వాహానాన్ని ఆపి తనిఖీ చేయగా.. 10క్వింటాల్ల రేషన్ బియ్యాన్ని పట్టుబడినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న బిట్టుపల్లి గ్రామానికి చెందిన కాసు రంజిత్ పై సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంథని ఎస్ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేశారు.