ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కవిత రిమాండ్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో కవితను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ వాదించింది. ఆమెను కస్టడీకి అప్పగించాలని కోరింది. అయితే ఇప్పటికే న్యాయస్థానంలో తన పిటిషన్ విచారణలో ఉండగానే తనను అరెస్టు చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును సాయంత్రం గం.4:30కి రిజర్వు చేసింది.