ఆరు గ్యారెంటీలు చరిత్రత్మకం..
ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలుపించండి..
సారంగాపూర్ జడ్పీటీసీ, నిర్మల్ జిల్లా జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని పలు గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని గురువారం ఉదయం నిర్వహించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జౌళీ లో సారంగాపూర్ జడ్పీటీసీ, నిర్మల్ జిల్లా జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధి కూలీలతో జౌళీ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే దేశ అభివృద్ధి అని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారేంటి పథకాలు చారిత్రాత్మకమైనవని అన్నారు. దేశ అభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సారంగాపూర్ మండల అధ్యక్షులు బొల్లోజు నర్సయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మసీరోద్దీన్, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాదుల భూపతి, గ్రామ కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ కార్యకర్తలు రిటైర్డ్ టీచర్ జగదీశ్వర్, ఓలత్రి రాజారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.