జిల్లా టాస్క్ ఫోర్స్ కోహెడ పోలీసులు
ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 17 : పర్మిషన్ లేకుండా బెల్ట్ షాపులు నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కోహెడ మండల కేంద్రంలో గోల్డెన్ దాబా యజమాని బత్తిని సాయి తేజ తండ్రి సత్తయ్య, ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మద్యం బాటిళ్లు కలిగి ఉన్నాడని సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, కోహెడ పోలీసులు కలసి రైడ్ చేసి 30.150 లీటర్ల బీర్లు విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే గాగిల్లాపూర్ గ్రామంలో కొండ శరత్ తండ్రి లింగయ్య, ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా తన ఇంటిలో బెల్ట్ షాపుపై నడుపుచున్నాడని సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు రైడ్ చేసి 9. 50 లీటర్ల బీర్లు విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. ఇండ్లలో, హోటల్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, కిరాణా షాపులలో, ఇతర దుకాణాలలో ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడిపితే, బహిరంగ ప్రదేశంలో కానీ ఇళ్లల్లో గానీ పేకాట ఆడితే సమాచారం అందించాలని కోరారు. జూదం పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు.