ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండటం, స్క్రిప్ట్ బుక్‌కు పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపుగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, VFX పనులు కొనసాగుతున్నాయి. కాగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది.