నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 18 : నిర్మల్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే సోమ మండలంలోని పలు గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ ఆయా విభాగాల పదాధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా అదే మండలంలోని వెల్మల్, బొప్పారం, గ్రామ పార్టీ అధ్యక్షులు బండారి నర్సయ్య, 1- 7 వ వార్డ్ సభ్యులు తలారి ప్రభాకర్ ,జక్కా మోహన్ ,పన్నాగులు సాయన్న ,గొల్ల సిద్దన్న, 100 మంది గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కూచాడి శ్రీహరి రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవడం ఖాయమని.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ అక్క భారీ మెజారిటీ తో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఎంపీ అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ సోన్ మండల మాజీ అధ్యక్షులు మహమ్మద్ మోహినుద్దీన్, సోన్ మండల పార్టీ అధ్యక్షులు మధుకర్ రెడ్డి, నాయకులు మాదాపూర్ మాజీ సర్పంచ్ రాజనర్సింహ రెడ్డి, ,రమేష్ రెడ్డి, కూచంపల్లి లింగన్న, యువకులు తదితరులు పాల్గొన్నారు.