గైర్హాజరైన ప్రాదేశిక సభ్యులు
ప్రతిపక్షం, రామగిరి (మంథని), ఏప్రిల్ 08 : రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన 23వ మండల సాధారణ సర్వసభ్య సమావేశం ప్రజా ప్రతినిదుల గైర్హాజరుతో వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసిన సర్వసభ సమావేశానికి మండల ప్రజా ప్రతినిధులు గైర్హాజరు కావడంతో కోరం లేని కారణంగా ఎంపీపీ అరెళ్ళి దేవక్క కొమురయ్య గౌడ్ సమావేశాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభించాల్సి ఉండగా.. ఒకే ఒక్క ప్రదేశిక సభ్యుడు కొప్పుల గణపతి హాజరు కాగ, 12:30 వరకు వేచి చూసి మరెవరూ రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు.
ప్రజల సమస్యలను అధికారుల ముందు ప్రస్తావించి, పరిష్కారానికి చొరవ చుపాల్సిన ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం పై వారి చిత్తశుద్ధిని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శైలజా రాణి, ఎంపీఓ సమ్మి రెడ్డి, విద్యుత్ ఏఈ మహేందర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ సీత రామయ్య, పశువైద్యాధికారి దుర్గాప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి భూక్యా మోహన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అశోక్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సాయి, పంచాయతీరాజ్ ఏఈ రవికుమార్, ఏపీఏం స్వరూప రాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు శారద, అనిత తదితర అధికారులు హాజరైయ్యారు.