ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ పేరు మారింది. ఆ కార్యక్రమాన్ని ‘వనమహోత్సవం’గా మారుస్తూ.. కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జులై మొదటి వారం నుంచి 9 విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కానున్నారు. టేకు, వేప, కానుగ, సుబాబులు, చింత, మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి వంటి పలు రకాల మొక్కలను పెంచనున్నారు.