ప్రతిపక్షం, ఢిల్లీ: పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు మార్చి 15వ తేదీలోపు మరో బ్యాంక్ ఫాస్ట్ ట్యాగ్‌కి మారాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు లేదా రెట్టింపు రుసుము చెల్లించాల్సిన సమస్యలు తలెత్తకుండా ఇది సహాయపడుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పేటీఎం పాస్ట్ టాగ్స్ వినియోగదారులు 15 తర్వాత ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయలేరు. అయినప్పటికీ, వారు తమ ప్రస్తుత బ్యాలెన్స్ ని గడువు తేదీ తర్వాత కూడా టోల్‌లు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.