Trending Now

టెన్షన్ టెన్షన్.. 22 రోజులు ఎదురుచూసుడే..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, 14 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలు ఎవరు ఊహించని రీతిలో ప్రశాంతంగా విజయవంతంగా కొనసాగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో తొమ్మిది మంది ఈ పార్లమెంట్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు గా పోటీపడ్డారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య మాత్రమే కొనసాగింది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఎన్నికల అధికారులు, కలెక్టర్లు చేసిన ప్రయత్నాలు చాలావరకు సఫలమృతమయ్యాయి. సోమవారం నాడు 11 గంటలు పోలింగ్ కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.

ఎన్నికలలో సోమవారంతో ఓటర్ల పని పూర్తయిన పోటీపడిన ఎంపీ అభ్యర్థులు వారి అనుచరులకు మాత్రం ఫలితాల కోసం 22 రోజులు నిరీక్షణ చేయక తప్పడం లేదు. నాలుగు నా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలబడునున్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియ ఒక ఎత్తు అయితే ఫలితాల కోసం నిరీక్షణ చేయడం మరో మరో ఎత్తు కానుంది. 2019 కూడా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం 40 రోజులు నిరీక్షణ చేయక తప్పలేదు. ఇప్పుడు కూడా 22 రోజులు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షణ తప్పట్లేదు.

Spread the love

Related News

Latest News