ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్, తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి, రాజోలులో దేవ వరప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు.
మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి..
ఎన్నికల ఫలితాల్లో కూటమి దూసుకుపోతోంది. ప్రస్తుతానికి టీడీపీ 81, జనసేన 16, బీజేపీ 5, వైసీపీ 15 స్థానాల్లో ముందందజలో ఉన్నాయి. దీంతో కూటమి మ్యాజిక్ ఫిగర్ 88ను దాటింది. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.