ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన స్వర్గీయ శెట్టిపెల్లీ రామ్ రెడ్డి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అయితే వారి కుమార్తే కావ్యకు 30/03/2024 నాడు వివాహం జరగనుంది. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావ్య వివాహానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరరాం మండల పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి, వల్లాల గ్రామ మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్లకొండ పరమేష్ పాల్గొన్నారు.