The Supreme Court has ordered an independent investigation into the Tirumala Laddu case: తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఆధారాల్లేకుండా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇది వరకే తప్పుబట్టిన న్యాయస్థానం ఇవాళ తదుపరి విచారణను చేపట్టింది. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు చేయాలని కోరింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు, కల్తీ జరిగిందని మీరు ఊహించనుకుంటున్నారా అని ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే, తిరుమల లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.