ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చట్ట సభల్లో లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లంచాలు తీసుకుని చట్ట సభల్లో ప్రశ్నలు అడిగే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొవాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. 1998లో ఇదే కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తాజాగా కొట్టేసింది. క్యాష్ ఫర్ క్వెరీ కేసులో ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించలేమని.. విచారణను ఎదుర్కొవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.