Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ మీద, నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో యువత పెద్ద ఎత్తున పాల్గొని జగన్ కు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్‌కు తరలించారు.