Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వర్సెస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మారిపోయింది. పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ ట్వీట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ‘గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?..’ అంటూ తాజాగా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు.
కాగా.. ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సున్నితాంశాలపై ప్రకాశ్‌రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాశ్‌రాజ్ అంటే గౌరవం ఉందని, కానీ విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ ప్రశ్నలకు సమాధానమిస్తానని పేర్కొన్నారు. ఇక, నిన్న హీరో కార్తీ లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు పవన్‌కు సారీ చెప్పిన నేపథ్యంలో ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్..’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా ‘గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.’ అంటూ మరో ట్వీట్ చేశారు.