Trending Now

రేపు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు కోటా మే 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లిస్తే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని అధికారుల తెలిపారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా, శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వార్షిక ప‌విత్రోత్స‌వాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు కోటాను మే 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి.

Spread the love

Related News

Latest News