Tirupati Laddu Case Supreme Court Hearing: తిరుమల లడ్డూ వివాదంలో ఏపీ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. విచారణ పూర్తవ్వకముందే మనోభావాలు దెబ్బతీసేలా మీడియా ముందు ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. కాగా, లడ్డూలు రుచిగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని టీటీడీ లాయర్ పేర్కొన్నారు. దీనికి ఆ లడ్డూలను పరీక్షలకు పంపించారా అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటి? రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. సెప్టెంబర్ 25న ఎఫ్ఐఆర్ నమోదు కాగా, సెప్టెంబర్ 26న సిట్ ఏర్పాటైంది.





























