ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐపీఎల్ మెగా టోర్నీ 2024 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. శనివారం హాలిడే కావడంతో ప్రతి సారి రెండు మ్యాచ్ లను నిర్వహిస్తోంది ఐపీఎల్ యాజమాన్యం. ఇక ఇవాళ మొదట 4 గంటలకు పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్‌లోని ఎంవైఎస్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక మరో మ్యాచ్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.