ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణ కుంభమేళా మేడారం జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. గద్దెలపై కొలువుదీరిని సమ్మక్క-సారలమ్మలు నేడు సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ చేరుకోవడంతో మేడారం జాతర ముగియనుంది. అయితే ఇప్పటి వరకు మేడారం జాతరకు కోటి 20 లక్షల మంది వచ్చినట్లు మంత్రి సీతక్క తెలిపారు. నిన్న ఒక్క రోజే 60 లక్షల మంది వరకు తల్లులను దర్శించున్నట్లు అధికారులు వెల్లడించారు.