These are the films that are competing for ‘Dussehra’: టాలీవుడ్‌లో సినిమా రిలీజ్‌లకు ‘దసరా’ పండుగ గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. విజయ దశమి సందర్భంగా తమ సినిమాలను విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఫెస్టివల్ సీజన్‌లో రిలీజ్ అయిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటాయని మేకర్స్ అభిప్రాయం. ఇక ప్రతి ఏడాది లాగే ఈ ‘దసరా’ పండక్కి కూడా పలు పెద్ద, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
శ్రీను వైట్ల, గోపీచంద్ కాంబోలో వస్తున్న చిత్రం ‘విశ్వం’ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇటు గోపీచంద్‌కు గానీ, అటు శ్రీను వైట్లకు గానీ సరైన హిట్ పడటం లేదు. దీంతో ఇద్దరి ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. అక్టోబర్ 11నే ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రంతో రానున్నారు సుధీర్ బాబు. అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించారు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిందీ చిత్రం. మరి ఈ చిత్రంతోనైనా సుధీర్ హిట్ ట్రాక్ ఎక్కుతారా? లేదా? చూడాలి. ఇక, ‘జనక అయితే గనక’ చిత్రంతో రానున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న చిత్రమిది. సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. అక్టోబర్ 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ దసరా బరిలో తెలుగు స్టార్ హీరోలు ఎవరు లేకున్నా, ఆల్ ఇండియా సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ బరిలోకి దిగుతున్నారు.‘వెట్టయాన్’ చిత్రంతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా రానుంది. కన్నడ నటుడు ధృవ సర్జా నటించిన ‘మార్టిన్’ సినిమా కూడా ‘దసరా’ కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.