హీరో రామ్ – డైరెక్టర్ హరీశ్ శంకర్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. ఇక, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం డబుల్ ఇస్మార్ట్ సైతం అదే రోజున రిలీజై పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్ల సమయంలో హరీశ్ శంకర్.. తన తర్వాత చిత్రం రామ్‌తో ఉంటుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ, తాజా పరిణామాలతో ఈ సినిమాపై ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్లతో రామ్ – హరీశ్ శంకర్ కాంబోలో సినిమా అసలు పట్టాలెక్కదేమో అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చూసి హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను చూసి రామ్.. ఈ మూవీని వద్దనుకుంటున్నారంటూ కొంతమంది ఇప్పటకే ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. మరి దీనిపై రామ్, హరీశ్ శంకర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.