ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టాలీవుడ్ నిర్మాతలు, పలువురు సినీ ప్రముఖులు కలిశారు. నందమూరి బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని నిర్మాతలు సీఎంను కోరారు. ఇక, తమ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించారని, అలాగే ఇండస్ట్రీ సమస్యలను, విశేషాలను అడిగి తెలుసుకున్నారని భేటీ అనంతరం నిర్మాతలు వెల్లడించారు. సీఎం కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.