ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుడిగాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోయాయి. టోర్నడో తరహా గాలులకు దాదాపు 50 వేల చెట్లు నేలమట్టమయ్యాయి. భారీ వృక్షాలు కూడా నేలకొరగడాన్ని బట్టి.. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. 50 వేల చెట్లు ఒకేసారి నేలకొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.