హైదరాబాద్‌లో ఉన్న ఓటును తొలగించాలని TPCC సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ డిమాండ్
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల వారు ఇక్కడ నివసిస్తూ ఉంటే రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని TPCC సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. గాంధీభవన్‌లో శుక్ర వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 0.7 శాతం గత పార్లమెంట్ కన్న హైదరాబాద్ లో ఇప్పుడు పోలింగ్ తగ్గింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ చాలా తగ్గింది. ఎన్నికల అధికారి వద్ద ASD లిస్ట్ లో ఎంత మంది ఉన్నారని అడిగితే గోప్యత గా ఉంటుంది అని ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ తక్కువ జరగడానికి కారణాలు ఏమిటి.. అనేది ఎన్నికల కమిషన్ అన్వేషించాలన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు, తర్వాత GHMC ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల బెస్ మీద ఓట్లు వస్తాయి. కాబట్టి ఆంధ్రలో.. తెలంగాణ లోని ఇతర ప్రాంతాల్లో ఓటు వేసిన వారి ఓట్లు.. హైదరాబాద్ లో ఓటును తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.