TPCC అధికార ప్రతినిధి భవానీ రెడ్డి
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కేటీఆర్, కవిత, కేసీఆర్ అందరూ ఫోన్ ట్యాపింగ్‌లో భాగస్వాములేనని.. హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇద్దరు కేసీఆర్ చెప్పినదే చేశాం అన్నట్లు మాట్లాడుతున్నారని TPCC అధికార ప్రతినిధి భవానీ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏమి చేయనప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లి ఏం చేయలేదు అని చెప్పడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి మొదలు పెడితే.. కార్ రేసింగ్ వరకు అన్నింటిలో మీ ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు నిలదిస్తారు. కానీ చేసిన తప్పులకు మిమ్మల్ని వదిలేదు లేదు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హామీల అమలు మీద దృష్టి పెట్టింది. అన్ని శాఖలు అద్భుతంగా పని చేస్తున్నాయి. అవినీతి చేసి ఏమి ఎరగనట్లు వ్యవహరిస్తున్నాయి.
విద్యుత్ కొనుగోలులో విచారణకు పిలుస్తే.. గడువు అడుగుతున్నారు. ఏమి చేయనప్పుడు గడువు ఎందుకు..? అవినీతికి కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం. ఇప్పటికే కవిత అవినీతి చేసి జైల్లో ఉన్నారు. గతంలో 5 వేల పాఠశాలను మూయించారు. మా ప్రభుత్వం సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు కూడా నడిపిస్తాం అని సీఎం చెప్పారు. ఎన్నికల కోడ్ వల్ల విచారణ కొంత ఆలస్యం జరిగింది. చివరకు సంతోష్ రావు కూడా హరిత హారంలో కొనుగోలు చేసిన మొక్కలలో కూడా అవినీతి చేశాడు. గొర్రెలు, చేపల పంపిణీ నుంచి మొదలు పెడితే.. విద్యార్థులకు ఇచ్చే శానిటరీ ప్యాడ్స్ లలో కూడా అవినీతి చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.