ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ డబుల్ ఇంజన్ అంటే.. ఉన్న అప్పులను డబుల్ చేయడమే.. బీజేపీ దేశాన్ని నాశనం చేసిందని బీజేపీపై జగ్గారెడ్డి ఫైరయ్యారు. శ్రీరాముడి పేరు చెప్పి పబ్లిక్ ని పరేషాన్ చేస్తున్నారన్నారు. 2014 లో తులం బంగారం 28 వేలు.. మోడీ నాయకత్వంలో 75 వేలు.. మహిళలు ఆలోచన చేయాలని కోరారు. బీజేపీ నేతల ఆందోళనలు ఓట్ల దుకాణంలో భాగమే అని అన్నారు. అలాగే ఏపీ లో రాళ్లతో కొట్టుకుంటున్నారని.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ గురించి ఆలోచన చేయాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నెహ్రూ నుండి.. మన్మోహన్ సింగ్ వరకు దేశం అప్పు 55 లక్షల కోట్లు.. మోడీ వచ్చినప్పటి నుండి కోటి 13 లక్షల కోట్ల అప్పు చేశారని స్పష్టంచేశారు. మూడోసారి వచ్చి ఏం చేస్తారు..? అప్పులు చేసే ప్రధాని కాదు.. ప్రజా పాలన అందించాలి అనేది కాంగ్రెస్ విధానమన్నారు.