ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 31 : ఇటీవల అత్యంత సీరియస్ గాతెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన జిల్లా మైనింగ్ శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఆనంద్, నర్సాపూర్ (జి) మండల గిర్దావర్ (ఆర్ ఐ) సుమలత చాక్ పల్లి గ్రామంలో అక్రమ ఇసుక రవాణా చేయకూడదని, అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. పెడచెవిన పెడుతూ నిర్భయంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నదని తెలుసుకున్న ఆర్ ఐ సుమలత శుక్రవారం ట్రాక్టర్లను పట్టుకోవడం తో ఇసుక మాఫియా ఆక్రమణ బయటపడ్డాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దర్జాగా అక్రమ ఇసుక రవాణా జరగడం వెనుక ఉన్న మాఫియా ని పట్టుకోక పోవడంతో ఈ తతంగం నడుస్తుందని అధికారులు లోతుగా విచారించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అక్రమ ఇసుక రవాణా చేస్తూ పోలీస్ మండల మైనింగ్ సిబ్బందితో మంట కాగుతున్న ఇసుక మాఫియా పై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రంగా భూగర్భ జలాలు అలమటించి భావితరాలకు నష్టం వాటిలుతుందని మండల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయిలో అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీచేసినాపై అధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లిన ఎలాంటి భయం లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతుండడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇసుక డంపులు పట్టుబడ్డ ఆ ఇసుక డంపు వేసిన వారికే ఇసుక టెండర్ దక్కడం లాంటివి జరగడంతో అధికారుల పట్ల భయం తొలగిపోయి దర్జాగా ఇసుక మాఫియా నిర్మల్ జిల్లా నర్సాపూర్( జి)మండలం చాక్ పెల్లి గ్రామం వేదికగా అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఈ ఇసుక తంతంగంపై పూర్తిస్థాయి విచారణ జరిపేంత వరకు సహజ వనరులు దోపిడీకి గురవుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.