Actress Asha Sharma passes away: సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ(86) వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె..ఆదివారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆమె ఆత్మ శాంతి కలగాలని రాసుకొచ్చింది.
ఆశా శర్మ..40ఏళ్లుగా హిందీలో పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. చివరిసారిగా ఆమె తెలుగులో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’లో శబరి పాత్రలో నటించింది. అంతకుముందు ‘దో దిశయాన్’, ‘ముఝే కుచ్ కెహనా హై’, ‘ప్యార్ తో హోనా హి థా’, ‘హమ్ తుమ్హారే హై సనమ్’ వంటి సినిమాల్లో నటించారు. అలాగే ‘కుంకుమ్ భాగ్య’, ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, ‘ఏక్ ఔర్ మహాభారత్’ వంటి సీరియల్స్‌లోనూ నటించింది. ఈ మేరకు ఆమె మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.