Trending Now

Trains cancelled: భారీ వర్షాలు.. ఆ రూట్లో రైళ్లు రద్దు

20 Trains Cancelled in Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రహదారులు జలమయమయ్యాయి. అలాగే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయిగుండంగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

కాగా, ఈ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా, గత 24 గంటల్లో మచిలీపట్నంలో 19 సెం.మీ, విజయవాడలో 18 సెం.మీల వర్షపాతం నమోదైంది. మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దక్షిణ మధ్య రైల్వే..విజయవాడ మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేసింది.

రద్దు చేసిన రైళ్లు ఇవే..
విజయవాడ టూ తెనాలి, తెనాలి – విజయవాడ, విజయవాడ – గూడూరు, గూడూరు – విజయవాడ, విజయవాడ – కాకినాడ పోర్టు, తెనాలి – రేపల్లె, రేపల్లె – తెనాలి, గుడివాడ – మచిలీపట్నం, మచిలీపట్నం – గుడివాడ, భీమవరం – నిడదవోలు, నిడదవోలు – భీమవరం, నర్సాపూర్ – గుంటూరు, గుంటూరు – రేపల్లె, రేపల్లె – గుంటూరు, గుంటూరు – విజయవాడ, విజయవాడ – నర్సాపూర్, ఒంగోలు – విజయవాడ, విజయవాడ – మచిలీపట్నం, మచిలీపట్నం – విజయవాడ, విజయవాడ – ఒంగోలు రైళ్లను రద్దు చేసింది.

Spread the love

Related News

Latest News