ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 21: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు ఆధ్వర్యంలో, కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, చిగురుమామిడి మండలంలో కంది తిరుపతి రెడ్డి, భీమదేవరపల్లి మండలంలో తాళ్లపల్లి ఐలయ్య, అక్కన్నపేట మండలంలో జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వేరువేరుగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించిన వారిలో అతి పిన్న వయస్కుడని శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడన్నారు ఇతని వర్ధంతి రోజైన మే 21రోజున జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు దేశంలో ఐటీ విప్లవాన్ని తెచ్చి ప్రపంచంలోనే పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గలిగిన దేశంగా నిలిపి 21వ శతాబ్దపు భారతదేశ వాస్తుశిల్పి” గా కీర్తించబడినదని సాంకేతిక విప్లవంతో భారతదేశ అభివృద్దిని ఉరుకులు పెట్టించి దేశం కోసం ప్రాణాలిచ్చిన దివంగత ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.