Donald Trump promises free IVF for women: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే..మహిళలకు ఐవీఎప్ చిక్సతను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఆయనే స్వయంగా వెల్లడించాడు.
ట్రంప్ పాలనలో ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. లేని సమక్షంలో బీమా కంపెనీలు తప్పనిసరిగగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా, అమెరికాలో ఐవీఎఫ్ చికిత్స ఖర్చుతో కూడుకున్నదని, ఒక్కసారికే దాదాపు 10వేల డాలర్ల వరకు ఖర్చవుతుందన్నారు.