ప్రతిపక్షం, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండు రోజులు పొడిగించారు. మొదట నిర్ణయించిన మేరకు గడువు ఈ సాయంత్రంతో ముగియవలసి ఉంది. నిన్నటి వరకు 2.7లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. అయితే గతంలో పోలిస్తే తక్కువేనని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ రోజు, దాఖలైన దరఖాస్తులతో పాటు గడువు పెంపుతో వాటి సంఖ్యకొంత వరకు పెరగవచ్చని అంటున్నారు. కాగా దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే ఈ నెల 23వ తేదీ నుంచి 27 సాయంత్రం పనివేళలు ముగిసేలోగా సరిచేసుకోవచ్చని తెలిపింది.