ప్రతిపక్షం, కరీంనగర్ ఏప్రిల్ 18: కరీంనగర్ ఎంపీ స్థానానికి గురువారం రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. కరీంనగర్ లోని విద్యానగర్ కు చెందిన కోట శ్యాం కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
అలాగే గంగాధర్ మండలం గట్టుబూత్కూరు గ్రామానికి చెందిన పొత్తూరి రాజేందర్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ కి అందజేశారు.