ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 28 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ వద్ద నిర్మల్, ఖానాపూర్ జాతీయ రహదారిపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన స్పెషల్ డ్రేవ్ లో భాగంగా రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు నిర్మల్ ఎంవీఐ మహేందర్ తెలిపారు. వాహానాల యజమానులు, చోదకులు తప్పనిసరిగా సంబంధిత రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖలకు సంబంధించిన అన్ని అధికారిక ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. వాహానల సంబంధించిన ఫిట్నెస్, ఇన్సూరెన్స్ ఇతర పత్రాలతో పాటు వ్యక్తిగత అధికారిక ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రధాన అంతర్గత రహదారులపై రోజువారి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలలో ఈ విషయమై వాహానాల యజమానులు, చోదకులకు పలుమార్లు అవగాహన సదస్సులు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. వాహనాల, లేదా వ్యక్తిగత రోడ్డు రవాణా, పోలీస్ శాఖల సంబంధిత అధికారిక ధృవీకరణ పత్రాలు కలిగి లేని వారిని గుర్తించి వాహనాలను సీట్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.