Trending Now

Johnny Master: జానీ మాస్టర్‌కు ఊహించని షాక్.. నేషనల్ అవార్డు నిలపివేత!

Unexpected shock for Johnny Master.. National award suspension: కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. ఆయన కష్టానికి తగ్గ గుర్తింపు దక్కినట్టే దక్కి చేజారిపోయింది. జానీ మాస్టర్‌కు ఇటీవల ప్రకటించిన నేషనల్‌ అవార్డును నిలిపివేస్తున్నట్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌ ప్రకటించింది. అసిస్టెంట్ డ్యాన్సర్‌పై అత్యాచారం కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఏడాదికి గానూ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ కొరియోగ్రఫీకి జానీ మాస్టర్‌ ఎంపికయ్యారు. ధనుష్, నిత్య మీనన్ నటించిన ‘తిరుచిత్రం బలం’ చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు వరించింది.

Spread the love

Related News

Latest News