Centre approves Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శనివారం జరిగిన కేంద్ర క్యాబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విజ్ఞాన్ ధార పేరుతో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్)ను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ విధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వం మరో రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానంతోపాటు 11,12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-3 అనగా బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎంప్లాయిమెంట్ అని, ఐటీ, ఇండస్ట్రీయల్ మాదిరిగా త్వరలో బయో విప్లవం రానుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.